జిహాదీ జోన్‌లో పుతిన్: సీఎన్ఎన్ బేషరతుగా క్షమాపణలు

సోమవారం, 2 మార్చి 2015 (13:15 IST)
ప్రముఖ అమెరికన్ వార్తా ఛానెల్ సీఎన్ఎన్ రష్యా అధినేత పుతిన్‌కు క్షమాపణలు చెప్పింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి ప్రత్యేక వార్తా కథనం 'జిహాదీ జోన్' ప్రసారం చేస్తూ, పుతిన్‌కు చెందిక క్లిప్పింగ్ చూపింది. 
 
ఛానెల్ కార్యాలయంలో ఏర్పడిన సాంకేతిక సమస్యల వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది. పుతిన్ చిత్రం ప్రసారం కావడం తప్పే కాబట్టి క్షమాపణలు చెప్పామని సీఎన్ఎన్ పేర్కొంది. కాగా, తమ నేత చిత్రాన్ని తప్పుగా చూపడంపై అటు రష్యాలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
 
కాగా, అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే రష్యా ప్రతిపక్ష నేత బోరిస్‌ నెమ్‌త్సోవ్‌ (55)ను గత శుక్రవారం కాల్చి హతమార్చిన నేపథ్యంలో.. పుతిన్‌పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయికే పుతిన్‌ వెంటనే ఈ హత్యను ఖండించారు.

వెబ్దునియా పై చదవండి