అత్యాధునిక టెక్నాలజీ ఎక్కడికో వెళ్లిపోతోంది. ప్రపంచంలోనే తొలిసారి అంతరిక్షంలో ఓ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. ఇందుకోసం ఓ రష్యా నటి, దర్శకుడు స్పేస్‌లోకి వెళ్లారు. వీళ్లిద్దరూ మంగళవారం నింగిలోకి దూసుకెళ్లారు.
రష్యాకు చెందిన నటి యూలియా పెరెసిల్డ్, డైరెక్టర్ క్లిమ్ షిపెంకోలను కాస్మోనాట్ ఆంటోన్ ష్కాప్లెరోవ్ రష్యన్ సోయెజ్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.55 గంటల సమయంలో ఈ స్పేస్‌క్రాఫ్ట్ నింగిలోకి ఎగిరింది. కజక్‌స్థాన్‌లోని బైకనూర్‌లో ఉన్న రష్యన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ సోయెస్ స్పేస్‌క్రాఫ్ట్‌ను లాంచ్ చేశారు. వీళ్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు.
చాలెంజ్ అనే కొత్త మూవీ కోసం పెరిసిల్డ్, క్లిమెంకోలు స్పేస్ స్టేషన్‌కు వెళ్లారు. 12 రోజుల పాటు వీళ్లు స్పేస్ స్టేషన్‌లోనే ఉండనున్నారు. ఆ తర్వాత వీళ్లను మరో రష్యన్ కాస్మోనాట్ భూమి మీదికి తీసుకువస్తారు. అంతరిక్షంలోకి వెళ్లే ముందు పొందిన శిక్షణ తనకో సవాలని స్పేస్‌క్రాఫ్ట్ ఎక్కే ముందు నటి పెరెసిల్డ్ చెప్పుకొచ్చింది.