ప్రపంచంలోనే అతి పొడవైన కొండచిలువ.. ఎక్కడ కనిపెట్టారంటే?

గురువారం, 11 ఏప్రియల్ 2019 (14:45 IST)
ప్రపంచంలోనే అతి పొడవైన కొండచిలువను శాస్త్రవేత్తలు పట్టుకున్నారు. ఈ పాము 17 అడుగుల పొడవుంది. ఈ పామును అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పట్టుకున్నారు. 140 పౌండ్ల బరువుతో, 73 గుడ్ల పొదుగుతో కూడిన ఈ కొండ చిలువ దక్షిణ ఫ్లోరిడాకు చెందిన సైప్రస్‌ జాతీయ సంరక్షణ కేంద్రం నుంచి వెలికి తీసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
రేడియో ట్రాన్స్‌మిటర్స్‌ను వాడటం ద్వారా శాస్త్రవేత్తలు పైథాన్‌ల జాడను పసిగట్టారు. జంతు సంరక్షణ కేంద్రాలను పైథాన్‌లు అడ్డాగా ఎలా మలుచుకుంటున్నాయనే దానిపై లోతైన విశ్లేషణ జరపిందని వెల్లడించింది. ఇంకా 100.000 కొండచిలువలు మియామి పరిసరాల్లో నివసిస్తున్నాయని.. కొండచిలువలను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు