కాశ్మీర్‌కు సైనిక బలగాలు పంపండి : పాక్‌ను కోరిన హఫీజ్ సయీద్

మంగళవారం, 16 ఆగస్టు 2016 (16:21 IST)
కాశ్మీర్ అంశంలో భారత్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పాకిస్థాన్‌ను జమాత్ - ఉద్ -దావా చీఫ్ హఫీజ్ సయీద్ అన్నారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌కు నిరసనగా కశ్మీర్ కారవాన్ పేరుతో లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాశ్మీర్‌కు బలగాలను పంపి భారత్‌కు గుణపాఠం చెప్పాలని ఆయన పాక్ సైన్యాన్ని కోరారు. కాశ్మీర్ ప్రజల ఆందోళనలు తీవ్రమయ్యాయని, చనిపోయిన వారి త్యాగాలు వృథా కావన్నారు. వేర్పాటువాద సంస్థలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయని, పాక్ సైన్యం కాశ్మీర్‌కు బలగాలు పంపి భారత్‌కు గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.  

వెబ్దునియా పై చదవండి