నివాస ప్రాంతంలో కుప్పకూలిన టోక్యో విమానం...

సోమవారం, 27 జులై 2015 (12:03 IST)
విమానాలకు పట్టిన గ్రహణం వీడినట్టు లేదు. నివాస ప్రాంతాల్లో కుప్పకూలే విమానల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా జపాన్ రాజధాని టోక్యోలో చిన్న రకం విమానం ఒకటి జన నివాస ప్రాంతంలో కుప్పకూలింది. వివరాల్లోకి వెళితే.. టోక్యో విమానాశ్రయం నుంచి ముగ్గురు బయలుదేరిన విమానం ఒకటి నగర శివారులో ఉన్న చోఫూ ప్రాంతంలో అకస్మాత్తుగా ఇళ్లపై కూలిపడింది.
 
ఈ ప్రమాదంతో అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ప్రాణ నష్టం జరిగినట్లు తెలియలేదు. అయితే ఆ విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరిని మాత్రం రక్షించినట్టు సమాచారం అందింది. మిగిలిన ఇద్దరి పరిస్థితి తెలియరాలేదు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని నిప్పును అదుపుచేసే పనిలో ఉన్నారు. ఈ ప్రమాదంలో వరుసగా మూడు ఇళ్లు, రెండు కార్లలో రెండు కారులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

వెబ్దునియా పై చదవండి