సాధారణ పాములు కప్పలు, తొండలు, బల్లు, ఇతరాత్రా చిన్నచిన్న పురుగులను మింగడం మనం చూస్తుంటాం. కానీ, ఈ పాము మాత్రం ఏకంగా పట్టుకర్రనే మింగేసింది. ఈ పట్టుకర్రను మింగడానికి కారణం లేకపోలేదు సుమా..
ఈ పాముకు నాన్‌వెజ్ అంటే మహా ఇష్టంలా ఉంది. అందుకే పచ్చి మాంసాన్ని నిప్పు మీద వేసి కాల్చడానికి ఉపయోగించే పట్టుకారును మింగేసింది. ఆ పట్టుకారు కు కొన్ని వేడి వేడి మాంసం ముక్కలు ఉండటంతో నోరూరిన పాము వెంటనే దాన్ని మింగేసింది. ఇక.. తర్వాత దాని బాధ వర్ణణాతీతం.
అ పట్టుకారును మింగాక.. అది అరగక నానా యాతలు పడింది కూడా. చివరకు ఆ పామును పెంచుకునే వ్యక్తి వచ్చి నెమ్మదిగా... దాని నోట్లో నుంచి ఆ పట్టుకారును తీసేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో తెగ హల్ చల్ చేస్తున్నది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.