సౌదీ అరేబియాలో భిక్షాటన నిషిద్ధం. అయితే చట్టవిరుద్ధంగా భిక్షాటన చేస్తున్న ఒక వ్యక్తిని సౌదీ అధికారులు అదుపులోకి తీసుకుని అతడిని సోదా చేయగా నగదుతోపాటు 12 లక్షల సౌదీ రియల్స్ అతని ఇంట్లో లభించాయి. ఒక గల్ఫ్ దేశం నుంచి పెట్టుబడిదారు లైసెన్సు కూడా అతగాడు పొందినట్లు బయటపడింది. ఆ వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా సౌదీలో చట్టవిరుద్ధంగా విలాసవంతంగా నివసిస్తున్నారు.