రుతుపవనాల తర్వాత అరేబియాలో ఏర్పడే తొలి తుపాను

మంగళవారం, 17 అక్టోబరు 2023 (22:58 IST)
అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడింది. తుపాన్ తీవ్రమైతే అరేబియా సముద్రంలో రుతుపవనాల తర్వాత ఏర్పడే తొలి తుపాను ఇదే అవుతుంది. 
 
రానున్న 48 గంటల్లో ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను వల్ల వచ్చే 48 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 
 
వాతావరణ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి అక్టోబర్ 21వతేదీ నాటికి మధ్య అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు