ప్రేమ మైకంలో నిండా మునిగిపోయిన ప్రేమపిచ్చోడు ఏ పనైనా చేస్తాడనేందుకు ఈ దారుణ ఘటనే నిదర్శనం. పోలెండ్ లోని ఓల్స్టిన్ సిటీలో ఉన్న వార్మియా అండ్ మాజురీ యూనివర్శిటీలో సదరు ప్రేమికుడు నాలుగో సంవత్సరం వెటర్నరీ సైన్స్ విద్య అభ్యసిస్తున్నాడు. ప్రియురాలిని ఇంప్రెస్ చేయడం కోసం 'ఐ లవ్ యూ' అన్న ఆంగ్ల పదాలను ఓ కుక్క పొట్టకు కుట్టేసి ఆ ఇమేజ్ ను తన ప్రేయసి ఫేస్ బుక్ పేజిలో పెట్టాడు.