ఏయిరోస్ కార్పోరేషన్ ఓ పెద్ద ఎయిర్ షిప్ను తయారు చేస్తోంది. సాధారణంగా ఎయిర్ షిప్ 90 మీటర్ల పొడవు 27 అడుగుల వెడల్పు ఉంటుంది. కానీ కార్గోగా వినియోగించుకోవడానికి కొత్త వాటిని తయారు చేస్తున్నారు. కనీసం 169 మీటర్ల పొడవు ఉండేలా తయారుచేస్తున్నారట. ఇది ఏకంగా 66 టన్నుల బరువును గాలిలోకి లేపి ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకుపోగలదు.