వెయ్యి తేనెటీగలు కుట్టినా... ఇంకా బతికే ఉన్నాడు..

శుక్రవారం, 26 జూన్ 2015 (11:53 IST)
వెయ్యి తేనెటీగలు అతని ఒళ్ళంతా తూట్లు తూట్లు చేశాయి. అయినా అతను బతికే ఉన్నాడు. ఒకటి కాదు రెండు కాదు వెయ్యి చోట్ల ముళ్లను శరీరంలోకి వదిలాయి. అతగాడికి వైద్యం చేసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అదృష్టవశాత్తు అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. 
 
అమెరికాలోని అరిజోనాలో ఓ వ్యక్తి ఇంటి వెనుక స్థలంలో ఉన్న తేనెతెట్టెను అనుకోకుండా చెదరగొట్టాడు. దీంతో తేనెటీగలు ఒక్కసారిగా అతడిని చుట్టుముట్టి కుట్టేశాయి. అటువైపుగా వెళ్తున్న మరికొందరిని కూడా అవి కుట్టాయి. తేనెటీగలను నియంత్రించడానికి ఓ బీ కీపర్‌ను పిలిపించగా అతనినీ కుట్టాయి. తేనెటీగల దాడికి గురైన వ్యక్తి అక్కడ పనిచేస్తున్నాడని, ఆ ప్రాంతంలో అన్ని తేనెటీగలు ఉన్నాయని ఎవరూ వూహించలేదట. 
 
చెదరిని తేనెటీగలు స్థిమితపడడానికి రెండు మూడు రోజులు పట్టవచ్చని పిల్లలను, పెంపుడు జంతువులను బయటకు రానీయవద్దని, కార్లలో వెళ్లే వాళ్లు కిటికీలు మూసివేసుకోవాలని ఆ ప్రాంత అధికారులు ప్రజలను హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి