దుబాయ్‌లో బ్లడ్ మనీతో ఉరిశిక్షను తప్పించుకున్న భారతీయులు!

ఆదివారం, 21 డిశెంబరు 2014 (11:24 IST)
సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయులకు ఉరిశిక్ష తప్పింది. బ్లడ్ మనీ (నష్టపరిహారం) చెల్లించడంతో వీరు ఉరికంభమెక్కకుండా తప్పించుకున్నారు. కేరళకు చెందిన ఫజల్‌ ఇరిట్టి (35), ముస్తాఫా కున్నత్‌ (33), ఎం.షకీర్‌ (36) అనే ముగ్గురు కర్ణాటకకు చెందిన తమ సహచరుడు అష్రాఫ్‌ అనే వ్యక్తిని హత్య చేశారు. ఇందుకు సౌది అరేబియా కోర్టు వీరికి మే, 2008లో మరణ శిక్ష విధించింది. 
 
సౌది చట్టాల ప్రకారం దోషులు మృతుల కుటుంబాలకి వారు కోరిన పరిహారం చెల్లిస్తే శిక్ష తప్పుతుంది. అయితే వారికి ఆ మొత్తాన్ని చెల్లించే శక్తి లేకపోవడంతో సౌది అరేబియాలోని ఒక భారతీయ వ్యాపారవేత్త ఈ మొత్తాన్ని చెల్లించారు. ఈ వ్యాపారవేత్త బంధువులకు 1,33,200 డాలర్ల నష్ట పరిహారం (బ్లడ్‌ మనీ) చెల్లించారు. 

వెబ్దునియా పై చదవండి