కొలంబియాలో ముగ్గురు పురుషుల పెళ్ళికి చట్టబద్ధత: నటుడు-జర్నలిస్ట్-స్పోర్ట్స్‌‌ఇన్‌స్ట్రక్టర్ ఏకమయ్యారు..

గురువారం, 15 జూన్ 2017 (11:48 IST)
కొలంబియాలో స్వలింగ సంపర్కుల వివాహానికి గత ఏడాది ఏప్రిల్ నెలలో అధికారికంగా అనుమతులు లభించిన నేపథ్యంలో.. తాజాగా ఏకంగా ముగ్గురు పురుషుల పెళ్ళికి చట్టబద్ధత కల్పించింది. వివరాల్లోకి వెళితే ముగ్గురు పురుషులు పెళ్లి చేసుకుని పాలియామరస్ ఫ్యామిలీగా ఆవిర్భవించారు. వీరిలో ఓ నటుడు కూడా వుండటం గమనార్హం. దీనికి సంబంధించి కొలంబియా మీడియాలో వెలువడిన ఒక వీడియోలో నటుడు విక్టర్ హుగో ప్రాడా మాట్లాడాడు. 
 
ముగ్గురు పురుషుల్లో ఒకడైన హుగో ప్రాడా మాట్లాడుతూ... తాము మా వైవాహిక జీవితానికి అధికారిక గుర్తింపు కోరుకుంటున్నామని, మా హక్కులను మేము కాపాడుకోవాలని భావిస్తున్నామని తెలిపాడు. తన జీవిత భాగస్వాములుగా స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్ జాన్ అలెజాండ్రో రోడ్రిగూ, జర్నలిస్టు మాన్యూల్ జోన్ బెర్మాముండేజ్ ఉంటారని పేర్కొన్నాడు.
 
తమ వివాహానికి సంబంధించిన లీగల్ పేపర్లపై మెడిలిన్ నగరానికి చెందిన అధికారి సమక్షంలో సంతకాలు జరిగాయని తెలిపాడు. ఇకపై తమ ఫ్యామిలీ యూనిట్‌కు న్యాయపరమైన గుర్తింపు లభించిందన్నారు. తద్వారా ప్రపంచంలోనే తమదే తొలి పాలియామర్ ఫ్యామిలీ అని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి