టీచర్లు కూడా తుపాకీ పడితే..? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

గురువారం, 22 ఫిబ్రవరి 2018 (16:09 IST)
ఫ్లోరిడాలోని ఓ పాఠశాలలో 17ఏళ్ల నికోలస్ క్రూజ్ విచక్షణారహితంగా కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఫ్లోరిడా పాఠశాల కాల్పుల ఘటనలో గాయపడిన విద్యార్థులను ఆస్పత్రిలో పరామర్శించిన ట్రంప్.. గన్ కల్చర్‌పై ఎట్టకేలకు స్పందించారు. ఇప్పటికే గన్ కల్చర్‌ను వ్యతిరేకిస్తూ వాషింగ్టన్, చికాగో, పిట్స్‌బర్గ్ నగరాల్లో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. 
 
అలాగే వైట్ హౌస్‌లో ఉపాధ్యాయులతో, విద్యార్థులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. తుపాకీలను వాడటంలో అనుభవమున్న టీచర్‌ అంటే.. సాయుధ టీచర్‌ ఉంటే పాఠశాలల్లో కాల్పులకు పాల్పడే వారిని అడ్డుకోవచ్చునని చెప్పారు. 
 
దాదాపు 20 శాతం మంది ఉపాధ్యాయులు సాయుధ టీచర్లుగా మారితే.. ఇలాంటి కాల్పుల ఘటనలను అడ్డుకునే వీలుంటుందని వ్యాఖ్యానించారు. ఇంకా నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ సూచించిన విధంగా తుపాకీల కొనుగోలుదారుల విషయంలో తనిఖీలను మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు. కొన్ని రకాల తుపాకీల కొనుగోలుకు వయసు పెంపును కూడా పరిశీలిస్తామని డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 
 
అయితే ట్రంప్ నిర్ణయానికి కొందరు వ్యతిరేకిస్తున్నారు. కాగా.. ఫ్లోరిడా పాఠశాలలో ఫిబ్రవరి 14న అదే పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 17 మంది విద్యార్థులను బలితీసుకున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు