అమెరికా అధ్యక్షుడిగా పెత్తనం చెలాయించిన డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి దారుణంగా మారింది. ఇన్నాళ్లూ అధ్యక్ష పదవి వెలగబెట్టి... అడ్డమైన ట్వీట్లు పెడుతూ... ఎన్నోసార్లు ట్విట్టర్ ద్వారా అభ్యంతరాలు ఎదుర్కొన్న ట్రంప్... ఇప్పుడు శాశ్వతంగా ట్విట్టర్‌కి దూరమయ్యారు. ఆయన ఎకౌంట్‌ను శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ట్రంప్ రూల్స్‌ని అతిక్రమించారనీ... అందువల్లే ఈ చర్య తీసుకుంటున్నామని చెప్పింది ట్విట్టర్ యాజమాన్యం. అమెరికాలో ఏ అధ్యక్షుడికీ ఇంత ఘోర అవమానం జరగలేదని టాక్ నడుస్తోంది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ లెక్కలేనన్ని వివాదాస్పద ట్వీట్లు పోస్ట్ చేశారు. ఆయన అలా చెలరేగిపోతుంటే... అమెరికా అధ్యక్షుడు కదా అని ఇన్నాళ్లూ ట్విట్టర్ చేతులు ముడుచుకుని కూర్చుంది. ఎప్పుడైనా కొత్త అధ్యక్షుడిగా జో బిడెన్‌ను అమెరికా కాంగ్రెస్ ప్రకటించింది. ట్రంప్ రెక్కలు విరిగాయి. అంతే ట్విట్టర్‌కి ఎక్కడ లేని బలం వచ్చేసింది. రివర్స్ కౌంటర్ యాక్షన్ షురూ చేసింది.