ఓ వైపు నోబెల్ శాంతి బహుమతి పొందాలనే ఆశ- మరో వైపు అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి ఎన్నికవ్వాలనే లక్ష్యం. ఈ క్రమంలో ఆయన నిర్ణయాలు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఫలితంగా మధ్య ప్రాచ్యం, అఫ్గానిస్థాన్, వెనెజువెలా వంటి కీలక ప్రాంతాల్లో శాంతి కరవవుతోంది.
దానికి తాజా ఉదాహరణే అమెరికా- తాలిబన్ శాంతి ఒప్పందం. దోహాలో తాలిబన్ల తరఫున ముల్లా బరాదర్, అమెరికా పక్షాన ఆ దేశ ముఖ్య చర్చల ప్రతినిధి జల్మే ఖలీజాద్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. పాకిస్థాన్, టర్కీ, ఇండొనేసియా, చైనా తదితర దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.