జన్యుమార్పిడి ద్వారా సిద్దం చేసిన పందిగుండెను వైద్యులు మనిషికి అమర్చారు. ప్రస్తుతం ఆ రోగి వేగంగా కోలుకుంటున్నారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యుల ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. రోగి వేగంగా కోలుకుంటుండంతో వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఆ రోగికి రాబోయే మరికొన్ని వారాలు అత్యంత కీలకమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
గత యేడాది ప్రపంచంలోనే తొలిసారిగా ఈ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెల్సిందే. మృత్యువు అంచులకు చేరుకున్న 58 యేళ్ళ వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు ఈ ప్రయత్నం చేశారు. అయితే, ఆపరేషన్ తర్వాత రోగి వేగంగా కోలుకోవడం వైద్యులను ఆశ్చర్యపరుస్తుంది. ఆపరేషన్ జరిగిన రెండో రోజునే రోగి ఉత్సాహంతో ఉరకలేస్తూ జోకులు వేయడం ప్రారంభించారని వైద్యులు తెలిపారు.
అనారోగ్య కారణాలు, గుండె విఫలం కారణంగా రోగితో పంది గుండెను అమర్చాలని వచ్చిందని వైద్యులు తెలిపారు. అయితే, రానున్న కొన్ని వారాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. గత యేడాది ఈ యూనివర్శిటీ వైద్యులు ప్రపంచంలోనే తొలిసారిగా ఓ పంది గుండెను డెవిడ్ బెన్నెట్ అనే రోగికి అమర్చి రికార్డు సృష్టించిన విషయం తెల్సిందే. అయితే, ఈ ఆపరేషన్ జరిగిన కొన్ని రోజులకే ఆ రోగి ప్రాణాలు కోల్పోయాడు.