ప్రస్తుతం పుతిన్ వయసు 62 సంవత్సరాలు. పుతిన్ తన భార్య ల్యుదిమిలాకు 2013 జూన్ 7న విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆమె (55) తన భర్త సుదీర్ఘకాలం రష్యా రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ బహిరంగంగా కనిపించడం చాలా అరుదు. భార్యాభర్తలిద్దరూ విడిపోయారనే వదంతులకు ఇది కూడా ఊతమిచ్చింది. ఆయన దాదాపుగా బ్యాచులర్ జీవితాన్నే గడుపుతున్నారు.
ఈ సందర్భంగా ఓ పాత్రికేయుడు మహిళల కోసం మీకు సమయం ఉంటుందా? అని అడిగినపుడు సమయం ఉంటుందని పుతిన్ చెప్పారు. అయితే ఆ మహిళ ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉండగా ఒలింపిక్ జిమ్నాస్ట్ అలినా కబయేవాతో ఆయన సంబంధాలు నెరపుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. పుతిన్ యూరోపులో ఉన్న తన స్నేహితుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాను ప్రేమిస్తున్నట్లు చెప్పారని ఓ పత్రిక పేర్కొంది. కానీ తాను అలినా పెళ్లి చేసుకోబోతున్నాననే విషయాన్ని మాత్రం ఆయన ఖండించారని మీడియా తెలిపింది.