చిన్నబిడ్డలను బస్సులో తీసుకెళితే కండక్టర్ హాఫ్ టికెట్ డబ్బులివ్వమని అడిగితే గయ్ మంటూ సీన్ క్రియేట్ చేస్తాం. సంవత్సరమైనా కాని పిల్లలకు టికెట్ అడుగుతారా అంటూ గొడవకేసుకుంటాం. కానీ విమానంలో కూడా అదే పరిస్థితి తలెత్తితే.. ఏమవుతుంది? టికెట్ లేకుండా విమానంలో నాలుగేళ్ల పాప కనిపించడంతో అంత పెద్ద విమానాన్ని కూడా ఐదుగంటలపాటు ఆపేశారు. ఇది ఎక్కడో కాదు మన పొరుగు శత్రువు చైనాలో జరిగింది.
విషయానికి వస్తే.. నాలుగేళ్ల పాప ఐదు గంటల విమాన ఆలస్యానికి కారణమైంది. అంతేకాదు విమానంలోని ప్రయాణికులందరినీ మరోసారి భద్రతా సిబ్బంది తనిఖీ చేయాల్సిన పరిస్థితి తలెత్తేలా చేసింది. ఈ ఘటన చైనా రాజధాని బీజింగ్‌లో చోటుచేసుకుంది. బీజింగ్ నుంచి షాంఘై వెళ్తున్న విమానంలో ఓ నాలుగేళ్ల పాప టికెట్ లేకుండా ప్రవేశించింది.