అరిజోనా, ఫ్లోరిడా, కాలిఫోర్నియాలలో కార్చిచ్చు చెలరేగడం కొత్తేమీ కాదు! కానీ, కాలిఫోర్నియా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన విపత్తుగా నిలిచిపోయే స్థాయిలో ప్రస్తుత కార్చిచ్చు దహించివేస్తోంది. గవర్నర్ గావిన్ న్యూసమ్ రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
సొనోమా కౌంటీలోని కిన్‌కేడ్ అడవిలో బుధవారం అర్ధరాత్రి రాజుకున్న కార్చిచ్చు 54 వేల ఎకరాలకు పైగా విస్తరించి కాలిఫోర్నియా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భూతల మార్గంతోపాటు హెలికాప్టర్ల ద్వారా నీళ్లు చల్లుతూ మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమించినా మంట లు 5 శాతమే అదుపులోకి వచ్చాయి.
గంటకు 164 కిలోమీటర్ల వేగంగా భీకరమైన గాలులు వీస్తుండడంతో మంటలు ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి. దీంతో, కిన్‌కేడ్, శాంటా రోసా, సొనోమా ప్రాంతాల్లోని 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిం చారు.