సాధారణంగా కంటికి చిన్నపాము కనిపిస్తేనే ప్రాణభయంతో పరుగులు తీస్తాం. అలాంటిది ఏకంగా 16 అడుగుల పొడవు ఉండే పైతాన్ పాము పడక గదిలోకి వస్తే.. ఆ పరిస్థిని ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా ఇదే జరిగింది. ఓ యువతి నిద్రపోతుండగా పడక గదిలోకి పైతాన్ వచ్చింది. దాన్ని చూసిన ఆ యువతికి గుండె ఆగినంత పని అయింది. ఇంకేముందు.. బెడ్‌పై నుంచి కిందికి దూకి.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీసింది.