హీరో ఇన్ని కష్టాలు పడతాడా...? అని అడిగిందామె: అర్జున్

బుధవారం, 15 జూన్ 2011 (18:55 IST)
WD
గంగోత్రి, ఆర్య చిత్రాల కథానాయకుడు అల్లు అర్జున్‌ తాజాగా నటించిన చిత్రం 'బద్రినాథ్‌'. ఈ చిత్రం విడుదలై వారం రోజులయింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌తో బుధవారంనాడు వెబ్‌దునియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.

WD
అప్పుడే హెయిర్‌ స్టైల్‌ మార్చారే...?( సమ్మర్ క్రాఫ్‌లో కనబడ్డారు)
నవ్వుతూ... హెయిర్‌ పెంచుకోవడం చాలా కష్టం. దాన్ని మెయింటేన్‌ చేయడం మరీ కష్టం. బద్రినాథ్‌లో ఆ లాంగ్‌ హెయిర్‌కోసం ఉదయం 8 గంటలకు కూర్చుంటే రాత్రి 11 గంటల వరకూ పట్టేది. అన్ని గంటలపాటు కదలకుండా కూర్చోవాలంటే ఒకరకమైన నరకంగా ఉండేది. నా భార్య కూడా చూసి ఇంత కష్టంగా ఉంటుందా అని అమాయకంగా అడిగేది. అది ఆర్టిఫియల్‌ జుట్టు. దాన్ని పెట్టాలంటే లక్షరూపాయలు ఖర్చయ్యేది. ఖర్చు గురించి కాకుండా జుట్టును పెట్టుకుని మెయిన్‌టైన్‌ చేయడం చాలా రిస్క్‌. అఫ్‌కోర్స్‌ సినిమాకోసం కాబట్టి కష్టపడ్డాం.

WD
సినిమా టాక్‌ మీకెలా అనిపించింది?
ఓపెనింగ్‌ రోజే డివైడ్‌ టాక్‌ వచ్చింది. అయినా కలెక్షన్లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఈరోజు కూడా చాలాచోట్ల ఫుల్‌గా నడుస్తున్నాయి.

WD
డివైడ్‌టాక్‌కు కారణం ఏమంటారు?
ప్రేక్షకులు భారీ అంచనాలతో వచ్చారు. దాంతో వారు జీర్ణించుకోవడానికి టైమ్‌ పట్టింది. అందుకే వారు ఊహించిన దానికంటే భిన్నంగా ఉంది.

WD
వినాయక్‌ బద్రినాథ్‌ కథ విని రెండేళ్ళు పట్టింది అర్థం చేసుకోవడానికి అని అన్నారు? మరి మీకు..?
నాకు ఐదేళ్ళుగా ఈ కథ గురించి చిన్నికృష్ణ చెపుతూనే ఉన్నారు. ఆ కథను చాలా లావిష్‌గా తియ్యాలి. దానికోసం ఎన్నో సెట్లు, ఖర్చు పెట్టాలి. ఇవన్నీ అవుతాయా అనే అనుమానం మొదట్లో కలిగినా గీతా ఆర్ట్స్‌ కాబట్టి డేర్‌ చేసి ఖర్చుకు వెనుకాడకుండా సినిమా తీశాం. అదే బయట బ్యానర్‌ అయితే నేను ఖర్చుపెట్టనిచ్చేవాడ్నికాదు.

WD
యాక్షన్‌, డాన్స్‌ రెండింటిలో ఏది కష్టం?
యాక్షన్‌లో జిమ్మిక్కులు చేయవచ్చు. కానీ డాన్స్‌లు చేయడానికి కుదరదు. ఒరిజినల్‌ స్టామినా కావాలి. గ్రాఫిక్స్‌ అవీ పెట్టేస్తే ఇట్టే పట్టేస్తారు. డాన్స్‌ చేయడం చాలా కష్టం.

WD
WD
డాన్స్‌లో మిమ్మల్ని చూస్తుంటే చిరంజీవిగారు కన్పించారని వినాయక్‌ అన్నారు?
అవును. మొదటి పాటలో చూస్తే మీకు చిరంజీవిగారే కన్పిస్తారు. నా రోల్‌మోడల్‌ ఆయనే. మొదటి నుంచి ఆయన దగ్గరే డాన్స్‌ నేర్చుకున్నాను. ఆయన కన్పిస్తున్నారంటే నేను సక్సెస్‌ అయినట్లేగా.

WD
బడ్జెట్‌లు పెరిగిపోతున్నాయని గొడవచేస్తుంటే.. మీరు మరీ భారీ చిత్రాలు తీయడానికి కారణం?
బడ్జెట్‌ పెరిగిపోవడం అనేది ఒక్కరి విషయంలో జరగదు. సమిష్టి కృషి. కథ డిమాండ్‌ను బట్టి బడ్జెట్‌ పెరుగుతుంది. పాత కథే అయినా దాన్ని కొత్తగా ప్రెజెంట్‌ చేసి చూపు మరల్చకుండా ప్రేక్షకుడ్ని కట్టేయాలంటే ఏదో కొత్తదనం కావాలి. అది ఇంగ్లీషు చిత్రాల్లో ఉంటుంది. వాటి ముందు నిలవాలంటే ఏదో సాహసం చేయాలి.

WD
ఇది ఏ తరహా చిత్రమని భావిస్తున్నారు?
ఇది పక్కా మాస్‌ చిత్రం. హీరో ఇమేజ్‌ను పెంచే చిత్రమిది. అదీ కాకుండా లేడీస్‌ ఫిలిం కూడా.

WD
మాస్‌ అంటున్నారు. లేడీస్‌ అంటున్నారు? ఎలా ఎనలైజ్‌ చేస్తున్నారు?
లేడీస్‌ చిత్రమంటే.. కుటుంబకథా చిత్రమనికాదు. కుటుంబంలో లేడీస్‌ ఉంటారు. వారిలో చాలామంది యువతులకు నచ్చుతుంది. యూత్‌ సరేసరే. వారిలోనే మాస్‌ ఉంటారు.

WD
వినాయక్‌తో చేయడం ఎలా అనిపించింది?
బన్నీ తర్వాత వినాయక్‌తో చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ఎక్కడా వేస్టేజ్‌ లేదు. బెస్ట్‌ మేకింగ్‌ మ్యాన్‌ ఆయన.

WD
కొన్ని రీష్యూట్‌ చేశారనే వార్తలు వచ్చాయి?
ఎక్కడా, ఏ సీనూ రీష్యూట్‌ చేయలేదు.

WD
తమన్నాతో నటించడం ఎలా అనిపించింది?
తమన్నా టాలెంట్‌ చూసి.. గీతా ఆర్ట్స్‌లో చేయించాలని డేట్స్‌ బుక్‌ చేశాం. అప్పటికీ '100%లవ్‌' సినిమా కథకు ఆమె యాప్ట్‌ అని అందులో బుక్‌ చేశాం. ఆ తర్వాత బద్రినాథ్‌లో బుక్‌ అయింది. చాలా టాలెంటెడ్‌ ఆర్టిస్టు.

WD
ఈ సినిమాను చిరంజీవిగారు చూసి ఏమి కామెంట్‌ చేశారు?
చరణ్‌, చిరంజీవిగారు సినిమా చూసి మంచి కామెంటే చేశారు. చెప్పడానికి రావడంలేదు.

WD
మీ భార్య ఎలా స్పందించింది?
ఆమెకు సినిమాలు కొత్త. జూబ్లీహిల్స్‌ సరౌండిగ్స్‌లో పెరిగిన మనిషి. మల్టీప్లెక్స్‌ చిత్రాలు చూసిన అనుభవం ఉంది. మాస్‌ చిత్రాలు పెద్దగా చూడలేదు. ఆమె జడ్జిమెంట్‌ చెప్పలేకపోయింది. కానీ సినిమాకోసం హీరో ఇన్ని కష్టాలు పడతాడా? అని అమాయకంగా అడిగింది. అది గుర్తుకువచ్చినప్పుడుల్లా నవ్వు వస్తుంది.

WD
చరణ్‌తో కలిసి నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి?
కథ ఫైనల్‌ కాలేదు. ఇద్దరూ కలిసి చేయాలనుకున్నమాట వాస్తవమే. అది ఏడాది పట్టవచ్చు. ఐదేళ్ళు పట్టవచ్చు. కాంబినేషన్‌ మాత్రం అద్భుతంగా ఉంటుంది.

WD
పెండ్లికి ముందు తర్వాత మీ లైఫ్‌ ఎలా ఉంది?
అహ్‌.. హ... హ.... హ.. అంటూ... నాకంటే మీకే ఎక్కువగా తెలుసంటూ... తెవివిగా సమాధానమిచ్చారు.

వెబ్దునియా పై చదవండి