కొరియర్ బాయ్ కళ్యాణ్ సింపుల్ స్టోరీ... అంతే...: ప్రేమసాయి ఇంటర్వ్యూ

బుధవారం, 16 సెప్టెంబరు 2015 (22:16 IST)
నటుడిగా కెరీర్‌ను మొదలుపెట్టి.. క్రియేటివ్‌ కోసం వెతుకుతూ దర్శకుడు అయినవాడు ప్రేమసాయి. నితిన్‌, యామీగౌతమ్‌ జంటగా ఫోటాన్‌ కతాస్‌ బ్యానర్‌‌పై దర్శకుడయ్యాడు. గౌతమ్‌ మీనన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ నెల 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రేమ సాయితో ఇంటర్వ్యూ...
 
మీ నేపథ్యం గురించి?
నేను 1990లో కొన్ని తమిళ సీరియల్స్‌లో నటించాను. తెలుగులో అవి అనువాదమయ్యాయి. వాటిద్వారా నంది అవార్డ్స్‌ కూడా సొంతం చేసుకున్నాను. కాని నాలో క్రియేటివిటీ ఇంట్రెస్ట్‌ మాత్రం పోలేదు. నటునిగా సీరియల్స్‌లో నటించిన కొన్నాళ్ళకు బిగ్గర్‌ డ్రీమ్స్‌కు అక్కడ ప్లాట్‌ఫామ్‌ లేదనిపించింది. ఆ జోన్‌ నుంచి బయటకి వచ్చేసాను. కథలు రాయడం ప్రారంభించాను. యాక్టర్‌గా నాకు పది సంవత్సరాల అనుభవం ఉంది. ఆ ఎక్స్పీరియన్స్‌‌తోనే దర్శకునిగా రాణించగలననే కాన్ఫిడెన్స్‌ వచ్చింది. దాంతో మొదటగా ప్రభుదేవా దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసాను. శంకర్‌ దాదా ఎంబిబిఎస్‌, అరవంలో ఓ చిత్రానికి కో-డైరెక్టర్‌గా పని చేసాను. అలా రెండు మూడు సినిమాలకు పని చేసిన తరువాత కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌ కథ రాసుకున్నాను. 
 
కొరియర్‌ బాయ్‌ కథేమిటి?
చాలా సింపుల్‌ కథ. ప్రస్తుతం ఉన్న జనరేషన్‌కు ఖాది అంటే ఏంటో తెలియదు. సినిమాలో మా హీరోయిన్‌ ఖాది భండార్‌లో పనిచేసే ఓ సేల్స్‌ గర్ల్‌. వీళ్ళ జంట ఆడియన్స్‌కు కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో నేను చెప్పబోయే పాయింట్‌ మీద ఇప్పటివరకు ఎలాంటి చిత్రాలూ రాలేదు.  ప్రస్తుతం వస్తున్న సినిమాలలో కామెడీ ట్రాక్‌, 5 పాటలు, ఒక ఐటెం సాంగ్‌ ఉంటున్నాయి. కాని నేను అవి ఫాలో కాలేదు. ఫిక్స్డ్‌ ఫార్ములాలను నేను నమ్మను. ప్రేక్షకులు కంటెంట్‌ ఉన్న సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. సాధారణంగా హీరో అంటే బోల్డ్‌గా ఉండే క్యారెక్టర్స్‌లోనే నటిస్తారు. కొరియర్‌ బాయ్‌గా ఎవరు నటించరు. కానీ నితిన్‌ అంగీకరించాడు.
 
గౌతమ్‌ మీనన్‌ను ఎలా ఒప్పించారు?
మొదట ఈ చిత్రాన్ని తమిళంలో హీరో జైకు చెప్పాను. డైరెక్టర్‌గా ఇది నా మొదటి సినిమా సో.. మంచి బ్రాండ్‌ ఉన్న ఇనిషియల్‌తో రావాలనుకున్నాను. గౌతమ్‌గారిని కలిసి కథ నేరేట్‌ చేశాను. ఆయన కథ విన్న వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలో కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా చేద్దామని చెప్పారు. 
 
రెండు భాషల్లో ఒకే విధంగా ఉంటుందా?
మొదట నేను కథ రాసుకున్నప్పుడు తమిళ నేటివిటీకు తగ్గట్లుగా రాసుకున్నాను. తెలుగులో కూడా చేయాలనేసరికి తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేసాను. రీజనల్‌ డిఫరెన్సెస్‌ అనేవి ఉంటాయి. దానికి తగినట్లుగా స్టొరీ కూడా ఉండాలి.
 
తెలుగులో నితిన్‌నే ఎందునుకున్నారు?
తెలుగులో సినిమా చేయాలనుకున్నప్పుడు హీరోగా కొంతమంది పేర్లు సజెస్ట్‌ చేసారు. అందులో నితిన్‌ పేరు కూడా ఉంది. ఇష్క్‌ సినిమా తరువాత ఆయన చాలా కథలు విన్నారు. అన్ని ఒకే ఫార్మాట్‌లో ఉండటం వలన ఏ సినిమా ఓకే చేయలేదు. ఈ కథను నేను నేరేట్‌ చేయగానే కొత్తగా ఉందని ఒప్పుకున్నారు. 
 
విడుదలపై మీరెలా ఫీలవుతున్నారు?
నేను ప్రతి విషయం మోడరేట్‌గా తీసుకుంటాను. ఫిలిం మేకింగ్‌ చేసినప్పుడు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఎంజాయ్‌ చేసి వర్క్‌ చేసాను. నా పని నేను చేశాను. అవుట్‌‌పుట్‌ గురించి ఆలోచించను. అయినా నితిన్‌ సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు పండగ చేసుకుంటారు. ఆడియన్స్‌ అంతా చాలా క్లారిటీగా ఉన్నారు. ఫండ్స్‌ లేక స్టార్‌ హీరోల సినిమాలే లేట్‌గా రిలీజ్‌ అవుతున్నాయి. రెండు సంవత్సరాలు చేసే సినిమాను రెండు రోజుల్లో తీసేస్తున్నారు. డిస్ట్రిబ్యూటింగ్‌ అనేది పక్కగా ఉండాలి. గౌతమ్‌, నితిన్‌ బ్రాండింగ్‌ డిస్ట్రిబ్యూషన్‌లో ఉపయోగపడుతుంది. 
 
ముగ్గురు సంగీత దర్శకులతో చేయించడానికి కారణం?
మా సినిమా షూటింగ్‌లో వుండగానే యామి గౌతమ్‌ ఓ హిందీ సినిమా కమిట్‌ అయింది. నెల రోజుల్లో ఆమె షూటింగ్‌ పార్ట్‌ కంప్లీట్‌ చేయాలి. ఆ సమయంలో మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ డేట్స్‌ కుదరలేదు. కార్తిక్‌ మూడు పాటలు అందించారు. నితిన్‌ అనూప్‌తో ఒక సాంగ్‌ చేయిద్దామని చెప్పగానే ఆయనతో ఒక సాంగ్‌ చేయించాం. సందీప్‌ చౌహాన్‌తో పని చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఈ సినిమాకు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఆయనే అందించారు. 
 
చిత్రంపై ఎలాంటి హొమ్‌ వర్క్‌ చేశారు?
ఇదొక ఫిక్షన్‌ మూవీ. నాకు కామన్‌ మ్యాన్‌ స్టోరీస్‌ రాయడమంటే ఇష్టం. ఓ కొరియర్‌ బాయ్‌ను ఉదాహరణగా తీసుకుంటే తను రోజంతా ఫీల్డ్‌లో ఉంటాడు. రోజులో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. వాటిని ఆధారంగా చేసుకొని ఈ కథ ప్రిపేర్‌ చేసుకున్నాను. దీనికోసం చెన్నైలో ప్రొఫెషనల్‌ కొరియర్‌ ఆఫీసులకు వెళ్లి కొరియర్‌ బాయ్స్‌ అందరితో మాట్లాడాను. 
 
తదుపరి చిత్రాలు?
ప్రస్తుతం డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. కొంతమందికి సబ్జెక్ట్స్‌ చెప్పాను. కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌ సినిమా రిలీజ్‌ తరువాత అవి ఫైనల్‌ అవుతాయని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి