'మజిలీ'లో నాగచైతన్య నటనకి అద్భుతమైన అప్లాజ్... శివతో ఇంటర్వ్యూ

బుధవారం, 3 ఏప్రియల్ 2019 (21:42 IST)
తొలి చిత్రం ‘నిన్నుకోరి’తో సూపర్‌హిట్‌ సాధించిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య హీరోగా, సమంత అక్కినేని, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్లుగా షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మాతలుగా తెరకెక్కిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మజిలీ’. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌, పాటలు, ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ఉగాది కానుకగా ఏప్రిల్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ‘మజిలీ’ దర్శకుడు శివ నిర్వాణ ఇంటర్వ్యూ.
 
‘మజిలీ’ జర్నీ ఎలా స్టార్టయ్యింది?
నేను దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘నిన్నుకోరి’ అందరికీ నచ్చడంతో పాటు మంచి సినిమా తీశావు అని ప్రశంసలు వచ్చాయి. నాకు ఒకే జోనర్‌లో సినిమాలు తీయడం ఇష్టం ఉండదు. జోనర్‌ మారుద్దామని రెండు కథలు రెడీ చేసుకొని వచ్చే టైమ్‌కి అనుకున్న హీరోలందరివి డేట్స్‌ క్లాష్‌ వస్తుండడంతో అవి వర్కవుట్‌ అవ్వలేదు. ఎలా అనుకుంటున్న టైమ్‌లో నాగ చైతన్యగారు నాకు ఫోన్‌ చేసి ‘నిన్నుకోరి’ సినిమా నాకు బాగా నచ్చింది. నా బాడీ లాంగ్వేజ్‌ తగిన కథ ఉంటే తీసుకురా.. మనం కలిసి చేద్దాం అన్నారు. ఆ సమయంలో నా దగ్గర కథ లేదు. 
 
నేనప్పుడు వేరే కథల మీద ఆలోచిస్తున్నా. 20 రోజుల తర్వాత నాకు ఓ ఐడియా ఫ్లాష్‌ అయింది. అది ఫ్లాష్‌ కావడమే చైతన్య అనే ఇమేజ్‌తో ఫ్లాష్‌ అయింది. ఎందుకంటే చైతన్యని 19 ఇయర్స్‌ కుర్రాడిలా చూపించగలం, అలానే 34 ఇయర్స్‌లా కూడా చూపించగలం. ఆ స్ట్రాంగ్‌ పాయంట్‌ అతనిలో ఉంది. నాకు కూడా మన పాస్ట్‌లోకి తీసుకెళ్ళే సినిమాలు అంటే ఇష్టం. అలాగే క్రికెట్‌, లవ్‌, మ్యారేజ్‌ ఈ మూడు ఎలిమెంట్స్‌ తీసుకొని ఒక మిడిల్‌ క్లాస్‌ డ్రామాతో క్లబ్‌ చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే సినిమా అవుతుంది అనుకోవడంతో ఈ జర్నీ స్టార్టయ్యింది.
 
ఈ కథలో మీ రియల్‌ లైఫ్‌ ఇన్‌సిడెన్స్‌ ఏమైనా ఉన్నాయా?
నా ప్రతీ సినిమాలో ఎక్కడో అక్కడ నా రియల్‌ లైఫ్‌ ఇన్సిడెంట్స్‌ ఉంటాయి. అవి నా ఇంటర్మీడియట్‌లో జరిగినవి కావొచ్చు… లేదా నేను స్వయంగా అనుభవించినవి కావొచ్చు.. అవి నాలో కలిసిపోయి ఉంటాయి. మళ్ళీ వాటికి సంబందించిన సన్నివేశాలు రాసేటప్పుడు బయటకి వస్తాయి. అందులో ఏదయితే నాకు గట్టిగా ట్రిగ్గర్‌ అవుతుందో దానిని నేను సినిమాలో రాస్తాను. ఒక సీన్‌ రాయడం వేరు అదే సీన్‌ను జీవితంలో నుండి చూసి రాస్తే అది ఇచ్చే కిక్‌ వేరు..
 
ముందుగానే సమంత చైతన్య అనుకొనే ఆ సీన్లు రాశారా?
ముందుగా ఛై అనుకొని 20 నిమిషాలు కథ చెప్పాను. క్రికెటర్‌ అవుదామనుకొనే ఒక ఆస్పేరింగ్‌ యంగ్‌ క్రికెటర్‌ అవలేకపోతాడు. అతడు 34 ఇయర్స్‌కి వచ్చినప్పుడు గతంలోంచి బయటకు రావడానికి ఇష్టపడడు. అతన్ని గతంలోంచి బయటకు లాగాలని ట్రై చేసే ఒక భార్య ఉంటే… వాళ్ళిద్దరి మధ్య కాన్‌ఫ్లిక్ట్‌ ఎలా ఉంటుంది అనేది కథ. ఆ భార్య క్యారెక్టర్‌ రాయడం మొదలు పెట్టినప్పటి నుండే చాలా స్ట్రాంగ్‌ అయిపోతుంది. 

 
ముందు కథ అనుకున్నప్పుడు అంత స్ట్రాంగ్‌ లేదు. రాస్తూ ఉంటే ఫుల్‌ స్ట్రాంగ్‌ అయ్యి ఒక స్ట్రాంగ్‌ విమెన్‌ కావాల్సి వచ్చింది అందుకనే ఆ క్యారెక్టర్‌ కోసం సమంత అయితే యాప్ట్‌ అని సెలెక్ట్‌ చేయడం జరిగింది. ట్రైలర్‌లో వర్షంలో ఆ గొడుగు పట్టే సీన్‌ చూసి చాలామంది నన్ను అడిగారు ఈ రోజుల్లో కూడా అలాంటి వారు ఉన్నారా… అని మనకు తెలీదు కానీ ప్రతి రోజ భార్యలు భర్తల కోసం ఎదో ఒకటి చేస్తుంటారు. ఆ విషయాన్నే ఈ సినిమాలో చెప్పడానికి ట్రై చేశాను. అలాగని సామ్‌ క్యారెక్టర్‌ ప్రతిదానికి ఏడ్చే భార్య క్యారెక్టర్‌ కాదు చాలా స్ట్రాంగ్‌ కానీ.. తన భర్త విషయంలో మాత్రం కాస్త మినహాయింపు ఉంటుంది.
 
ఇండస్ట్రీలో సెకండ్‌ సినిమా సిండ్రోమ్‌ అనేది ఉంది కదా? ఏమైనా టెన్షన్‌ ఫీల్‌ అవుతున్నారా?
అలాంటిదేమి లేదండి! దాని గురించి నేను కూడా విన్నాను. అది నిజం కాదు. నా మొదటి సినిమా ‘నిన్నుకోరి’ కంటే ఎక్కువ కష్టపడి ఈ కథ రాశాను. కాబట్టి ఫెయిల్‌ అవడానికి ఎక్కడా అవకాశం లేదు.
 
‘నిన్నుకోరి’ సినిమాలో హీరో క్యారెక్టర్‌ చాలా సెన్సిబుల్‌గా డీల్‌ చేశారు కదా! ఇండస్ట్రీ నుండి ఎలాంటి అప్రిసియేషన్‌ వచ్చింది?
చాలా మంచి అప్రిసియేషన్‌ వచ్చింది. నాగార్జున గారు, మహేష్‌ బాబు గారు, రామ్‌చరణ్‌ గారు అభినందించారు. అందరూ చెప్పిన కామన్‌ పాయింట్‌ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్‌ స్టోరీ కదా… ఎలా చెప్పి ఒప్పించావు.. అని అడిగారు నేను.. చెప్పడం నా గొప్పతనం కాదండీ.. ఆ స్టోరీని ఒప్పుకోవడం నాని గారి గొప్పతనం అని చెప్పాను.
 
దివ్యాంశ కౌశిక్‌ క్యారెక్టర్‌ గురించి?
ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌ క్యారెక్టర్‌లో చిన్న నార్త్‌ ఇండియన్‌ షేడ్స్‌ ఉంటాయి. ఈ సినిమా కథలో భాగంగా పూర్ణ జీవితంలో ఒక లవ్‌ స్టోరీ ఉండాలి అది రొటీన్‌గా ఉండకూడదు అందుకని ప్రస్తుతం యూత్‌లో ఎలా జరుగుతుందో అలా చూపించడం జరిగింది.
 
టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
మనం చేసే సుదూర ప్రయాణంలో మధ్యలో సేద తీరే పాయింట్‌ని మజిలీ అని అంటారు. అలానే కాలంతో పాటు పరుగెడుతున్న ఒక మనిషి జీవితంలో తనని ఆపి, గైడ్‌ చేసి కొంత సేదతీర్చే పాయింట్‌ పెళ్లి. అదే కాన్సెప్ట్‌తో ఈ టైటిల్‌ పెట్టడం జరిగింది.
 
నరేషన్‌ టైమ్‌లో సమంత ఏమైనా సలహాలు ఇచ్చారా?
అలాంటిదేమి లేదండి! నా రెండు సినిమాలు కూడా సింగిల్‌ నరేషన్‌తోనే ఒప్పించడం జరిగింది. ఎందుకంటే ఒక స్టోరీని నేను పూర్తిగా నమ్మిన తరువాతనే ఇతరులకి చెప్తాను. అందుకనే నాకు నరేషన్‌ టైమ్‌లో ఎలాంటి ఇబ్బంది రాలేదు.
 
మీ రెండు సినిమాలు క్లాస్‌ గానే ఉన్నాయి?
లేదండి ! నిన్నుకోరి సినిమా కాస్త క్లాస్‌గా ఉంటుంది… కానీ మజిలీ సినిమాలో మాస్‌ కూడా ఉంటుంది. ట్రైలర్‌ చూస్తే ఇప్పటికే మీకు అర్ధం అయి ఉంటుంది. సినిమా చూస్తే పూర్తిగా అర్దం అవుతుంది.
 
మీ రెండు సినిమాలలో లవ్‌ ఫెయిల్యూర్‌ గురించే కదా! మీ నిజజీవితంలో అలాంటిదేమైనా ఉందా?
అలాంటిదేమిలేదు.. కాలేజీ డేస్‌లో చిన్న చిన్న క్రష్‌లు తప్ప నిన్నుకోరి, మజిలీ లాంటి లవ్‌ ఫెయిల్యూర్స్‌ లేవు. కానీ నా స్నేహితుల విషయంలో జరిగిన సంఘటనలను దగ్గరి నుండి చూసి అలాంటి క్యారెక్టర్‌లు రాసుకోవడం జరిగింది.
 
ఈ సినిమా స్టోరీ కూడా వైజాగ్‌లోనే స్టార్ట్‌ అయ్యిందా?
అవును నేను నా రెండు స్టోరీలు వైజాగ్‌‌లోనే రాశాను. మాది సబ్బవరం అని వైజాగ్‌ నుండి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అక్కడే వైజాగ్‌లో హోటల్‌లో ఫ్రెండ్స్‌తో ఉండి స్టోరీస్‌ రాస్తాను. లవ్‌స్టోరీకి బీచ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉంటే బాగుంటుంది అని అక్కడే కొంత భాగం షూటింగ్‌ చేశాము. అందుకే ఈ సినిమాలో… వైజాగ్‌లో పెళ్ళాలు మొగుళ్లని మాయ్యా అని పిలుస్తారు. అనే డైలాగ్‌‌తో పాటు సాహిత్యంలో కూడా వైజాగ్ ప్రత్యేకతలు ఉంటాయి.
 
సమంత, చైతన్యల పెర్‌ఫామెన్స్‌ గురించి చెప్పండి?
సామ్‌ ఎప్పుడూ బాగా చేస్తుంది. అయితే ఈ సినిమాలో చైతు అద్భుతంగా చేశారు. సమంత ఇప్పటివరకూ తనకు వచ్చిన అన్ని పాత్రలు చాలా బాగా చేసింది. కానీ చైతన్య ఎంత ఎక్స్‌ట్రార్డినరీగా చేయగలడనేది ఈ సినిమాతో మీకు తెలుస్తుంది. శ్రావణి పాత్రకు సమంత పూర్తి న్యాయం చేసింది. అయితే పూర్ణాగా మజిలీలో నాగచైతన్య అధ్బుతంగా నటించారు. వీరిద్దరూ నటనలో ఒకరితో ఇంకొకరు పోటీపడి నటించారు.
 
మిగతా ఆర్టిస్ట్‌ల గురించి?
ఈ సినిమాలో పోసాని గారు సమంత తండ్రిగా అద్భుతంగా నటించాడు. అలాగే చైతు తండ్రిగా రావు రమేష్‌ అప్పటికప్పుడే కోపం, కొడుకుపై ఉన్న ప్రేమ చూపించే క్యారెక్టర్‌ చేశారు. అయితే సామ్‌ క్యారెక్టర్‌ మిగతావాళ్ళ దగ్గర చాలా యాక్టివ్‌ కానీ భర్త దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం సైలెంట్‌గా ఉంటుంది. చైతూ క్యారెక్టర్‌ దానికి అపోజిట్‌గా ఉంటుంది.
 
ప్రొడ్యూసర్స్‌ గురించి చెప్పండి?
నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. పూర్తి కమర్షియల్‌ సినిమాలు ఓకే చెయ్యడం ఒకెత్తు ఇలాంట ఎమోషనల్‌ స్టోరీస్‌ని ఓకే చెయ్యడం వేరు. అయితే ఒక సెన్సిబుల్‌ కథ చెప్పేటప్పుడు ఈ ప్రొడ్యూసర్స్‌లా సినిమాని చూడగలిగితే.. ఇండస్ట్రీలో ఇంకా మంచి సినిమాలు వస్తాయని నా అభిప్రాయం. అయితే టోటల్‌ అవుట్‌పుట్ చూసి ప్రొడ్యూసర్స్‌ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్స్‌తో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనుంది.
 
మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌?
2, 3 స్టోరీస్‌ ఉన్నాయి. ఈ సినిమా విడుదలయిన తరువాత వాటి గురించి వివరిస్తాను. అందులో ఒకటి అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ స్టోరీ, మరొకటి అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. ఈ సినిమా తరువాత ఏ జోనర్ అయితే బాగుంటుంది అనేది నిర్ణయించుకుంటాను… అంటూ ఇంటర్వ్యూ ముగించారు డైరెక్టర్‌ శివ నిర్వాణ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు