వర్షం కారణంగా ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగా, కోల్‌కతా జట్టు 164 పరుగులకే పరిమితమైంది. అయినప్పటికీ మెరుగైన రన్ రేటున్న కారణంగా కోల్‌కతా జట్టు 16 పాయింట్లతో ప్లేఆఫ్ స్థానాన్ని ఖాయం చేసుకుంది.
ముంబై జట్టులో సౌరభ్ తివారీ 52, రాయుడు 63 పరుగులతో రాణించగా, కోల్‌కతా జట్టులో లిన్ 26, గంభీర్ 21, మనీష్ పాండే 33, యూసుఫ్ పఠాన్ 20, గ్రాండ్ హోమ్ 29 పరుగులు చేశారు. ఏ ఆటగాడు కూడా మంచి స్కోరును సాధించడంలో విఫలమైనందునే తాము మ్యాచ్ గెలవలేక పోయామని మ్యాచ్ అనంతరం గంభీర్ వ్యాఖ్యానించాడు. కాగా, క్వాలిఫయర్ రౌండ్‌లో ముంబై జట్టు పూణెతో తలపడనుంది. ముంబై వేదికగా మంగళవారం ఈ మ్యాచ్ జరుగనుంది.