ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సొంత గడ్డపై హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఇందులో భాగంగా కింగ్స్ జట్టు క్రికెటర్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. తీవ్రంగా సాధన చేస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాళ్లు ఎండవేడిమికి తట్టుకోలేకపోతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే కష్టాల్లో వున్న రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌కు షాక్ తగిలింది. ఐపీఎల్-10వ సీజన్‌కు తాను దూరం కానున్నట్లు కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్వయంగా వెల్లడించాడు. కుటుంబసభ్యులతో గడిపేందుకు దుబాయ్ వెళుతున్నట్టు తెలిపాడు. ఐపీఎల్‌కు ముందు భారత్‌కు టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా వచ్చిన సంగతి తెలిసిందే. సిరీస్ ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభం కావడంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ కుటుంబాలకు దూరమయ్యారు.
ఈ నేపథ్యంలో తమ ఫ్యామిలీతో గడపాలని స్మిత్ డిసైడైనాడు. ఇందులో భాగంగా ఆరు రోజుల పాటు ఐపీఎల్‌కు దూరమవుతున్నట్టు స్మిత్ చెప్పాడు. దీంతో, రెండు మ్యాచ్‌లకు స్మిత్ దూరం కానున్నాడు. అయితే స్మిత్ ఈ టోర్నీకే దూరమయ్యే ఛాన్సుందని క్రికెట్ పండితులు అంటున్నారు. కాగా ఏప్రిల్ 22వ తేదీన హైదరాబాదుతో పూణే తలపడనుంది.