ట్రెండింగ్ అదుర్స్.. ట్విట్టర్‌కే చుక్కలు చూపించిన చెన్నై బాయ్స్! (video)

శుక్రవారం, 22 మార్చి 2019 (15:36 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు శనివారం (మార్చి 23) నుచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ పోటీలు ప్రారంభం కాకముందే.. సోషల్ మీడియాను చెన్నై బాయ్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం నుంచి బయటపడి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ''రోర్ ఆఫ్ ది లయన్'' హాట్ స్టార్‌ నెట్టింట్లో విడుదలైంది. ఈ వీడియో  వైరల్ అయ్యింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ వీడియో ట్రెండ్ అయ్యింది. 
 
ఇంకా చెన్నై ఫ్యాన్స్ MSDhoniRoars పేరిట హ్యాష్‌ట్యాగ్ ద్వారా ట్రెండ్ అయ్యేలా చేశారు. ఈ వీడియోలో స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం సందర్భంగా ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి ధోనీ వెల్లడించాడు. ''రోర్ ఆఫ్ ది లయన్'' వీడియోను చూసిన ఫ్యాన్స్ ధోనీపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

ధోనీ స్పీచ్ ఈ వీడియోలో అదిరిందని కొనియాడుతున్నారు.. ధోనీ ఎప్పుడూ గొప్పేనని ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌నే ధోనీ ఫ్యాన్స్ షేక్ చేసేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రోర్ ఆఫ్ ది లయన్ వీడియో ట్రెండ్ అయ్యింది. అంతేగాకుండా అందులోని ధోనీ స్పీచ్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో మామూలుగా లేదు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు