ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ పోటీలు యూఏఈ వేదికగా జరుగుతున్నాయి. ప్రస్తుతం లీగ్ మ్యాచ్‌లు ముగింపు దశకు చేరుకోగా, త్వరలోనే ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. అయితే, ఈ ప్లే ఆఫ్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.
ప్రస్తుత సీజన్‌లో ఉన్న మూడు స్టేడియాల్లో షార్జాను వదిలేసి, దుబాయ్, అబూదాబి స్టేడియాలను మాత్రమే బీసీసీఐ ఎంచుకుంది. ఇక, పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు ప్లే ఆఫ్‌కు వెళతాయన్న సంగతి తెలిసిందే.
పాయింట్ల పట్టికలో టాప్ 1, 2 స్థానాల్లో ఉన్న జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచ్ నవంబరు 5వ తేదీన జరగనుంది. 6వ తేదీన టాప్ 3, 4 స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది.
ఆ తర్వాత 8వ తేదీన క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తలపడతాయి. ఆపై దుబాయ్ వేదికగా, ఐపీఎల్ తుది సమరం జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లలు రాత్రి 7.30 గంటలకు మొదలు కానున్నాయి.
కాగా, మూడు మహిళల టీమ్‌ల మధ్య పొట్టి క్రికెట్ పోటీలను నిర్వహించాలని నిర్ణయించిన బీసీసీఐ, అన్ని మ్యాచ్‌లకూ షార్జానే వేదికగా ప్రకటించినందువల్ల షార్జాలో ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉండబోవు.