ఇరవై ఏళ్ల క్రితం బీహార్ (అప్పటికీ దాన్నుంచి జార్ఖండ్ విడిపోలేదు) అసోంల మధ్య రంజీ మ్యాచ్ జరుగుతుంది. అసోం సెకండ్ ఇన్నింగ్స్. బ్యాట్స్‌మెన్ అసోం ఓపెనర్ పరాగ్ దాస్. బీహార్ తరఫున మన జార్ఖండ్ డైనమైట్ ధోని వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. బౌలర్ వేసిన బంతికి దాస్ ముందుకెళ్లి ఆడబోయాడు. అది కాస్తా మిస్సయింది. ఇంకేం.. అసలే వికెట్ల వెనుక బంతి కోసం ఆకలిగొన్న పులిలా వేచిచూసే మన డైనమైట్.. దాస్‌ను స్టంపౌట్ చేశాడు. ఆ పరాగ్ దాస్ కొడుకే ప్రస్తుత రియాన్ పరాగ్.
కాల చక్రం గిర్రున తిరిగింది. ఐపీఎల్ 2020 సీజన్. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్. బౌలర్ సామ్ కరన్. వికెట్ల వెనుక ధోని. బ్యాటింగ్ రియాన్ పరాగ్. కానీ ఈ సారి పరాగ్.. ధోనికి స్టంపింగ్ చేసే అవకాశమివ్వలేదు. అదండీ వీరి వెనకున్న ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒకప్పుడు తన తండ్రిని ఔట్ చేసిన వ్యక్తే.. ఇరవై ఏళ్ల తర్వాత కూడా కీపింగ్ చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్విట్టర్‌లో షేర్ చేశారు.