సంజు శాంసన్ ధోనీ వారసుడు కాదు.. ఎవరితో పోల్చొద్దు..

బుధవారం, 30 సెప్టెంబరు 2020 (13:22 IST)
Sanju Samson
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ మంచి పామ్‌లో వున్నాడు. ఈ జట్టు ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలోను 72, 85 పరుగులు చేసి జట్టు విజయాలలో కీలక పాత్ర వహించడమే కాకుండా ఈ రెండు మ్యాచ్‌లలోను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ గా నిలిచాడు. అయితే సంజు ఇదే ఆటను కొనసాగిస్తే మళ్ళీ భారత జట్టులోకి రావడం ఖాయమనిపిస్తోంది.
 
ఇక ఈ ఈ కేరళ బ్యాట్స్‌మెన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు గుప్పించారు.''సంజూ శాంసన్ నాకు పదేళ్లుగా తెలుసు. నాకు పరిచయమైనప్పుడు అతడికి 14 ఏళ్లు. ఏదో ఒకరోజు తప్పకుండా నెక్స్ట్ ఎంఎస్ ధోనీ అవుతాడు'' అని థరూర్ ట్వీట్ చేశాడు.
 
శశిథరూర్ ట్వీట్‌కు భారత క్రికెటర్ శ్రీశాంత్ స్పందిస్తూ...''అతడు ధోనీ వారసుడు కాదు. వన్ అండ్ ఓన్లీ సంజూ శాంసనే. అతడు 2015 నుంచి అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్‌గా ఆడాల్సింది. అతడ్ని ఎవరితో పోల్చొద్దు. అతడికి సరైన అవకాశాలు ఇస్తే.. భారత్ తరఫున కూడా ఇలాగే ఆడేవాడు. వరల్డ్ కప్‌లను గెలిచేవాడు. కానీ అలా జరగలేదు. అతడెన్నో రికార్డులు బద్దలు కొడతాడు. దేశానికి ఎన్నో వరల్డ్ కప్‌లు అందిస్తాడు. కాబట్టి అతణ్ని ఎవరితోనూ పోల్చొద్దు'' అని శ్రీశాంత్ తెలిపాడు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు