గల్ఫ్‌లో రంజాన్ వేడుకలు: అక్కడ ఎలా జరుపుకుంటారు?

FILE
మనదేశంలో ముస్లిం సోదరులు రాత్రి నిద్రపోయి తెల్లవారి నాలుగు గంటలకు లేచి సహర్‌ చేస్తారు. గల్ఫ్‌ దేశాల్లో రాత్రంతా తింటూ తెల్లవారు జామున సమాజ్‌ చదివి పడుకుంటారు. రంజాన్‌ నెల మొత్తం రెస్టారెంట్లు రోజంతా మూసివేస్తారు. బహిరంగంగా తినకూడదని, తాగకూడదని హెచ్చరికలుంటాయి.

దుబాయిలోని ఏకైక హిందూ దేవాలయమైన కృష్ణ మందిరంలో భక్తులకు ప్రసాదాన్ని రంజాన్‌ నెలలో ఇఫ్తార్‌ వేళల తర్వాతే ఇస్తారు. అరబ్బులు గల్ఫ్‌లోని అన్ని మసీదులలో రంజాన్‌ సందర్భంగా పౌష్టికాహారాన్ని నెల రోజుల పాటు ఉచితంగా సరఫరా చేస్తారు.

గల్ఫ్‌లో రంజాన్ ఫిత్రా కోసం ముస్లింల బెడద ఎక్కువగా ఉంటుంది. భారత్‌, బంగ్లాదేశ్‌, ఇరాన్ వంటి దేశాల్లోనూ భిక్షగాళ్లు దానాల కోసం వేచి వుంటారు. అందుకే మక్కా, మదీనా పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక వాహనాలలో బిచ్చగాళ్ల నిర్మూలన దళాలు 24 గంటలూ పనిచేస్తాయి.

వెబ్దునియా పై చదవండి