ఇస్లాం ఐదు మూలస్థంభాలేంటి? అల్లాహ్ అంటే ఎవరు?

గురువారం, 26 జూన్ 2014 (18:47 IST)
ఇస్లాం ఐదు మూలస్థంభాలు ఏంటో తెలుసా? ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం, భగవంతుడు (అల్లాహ్) తన ఆఖరి ప్రవక్త మహమ్మద్‌ను ఉపదేశకుడిగా పంపాడు. అతనే ఖురాన్ పవిత్ర గ్రంథాన్ని అవతరింపజేశాడు.  
 
ఇస్లాం ఐదు మూలస్థంభాలేంటంటే..
1. షహాద (విశ్వాసం),
2. సలాహ్(నమాజ్ లేదా ప్రార్థన),
3. సౌమ్ (ఉపవాసం),
4. జకాత్ (దాన ధర్మం),
5. హజ్ (పుణ్య యాత్ర).
 
అల్లాహ్ అంటే.. 
అల్లాహ్ ఆ సర్వేశ్వరుడి నామం. సకల చరాచర జగత్తును సృష్టించిన మహాసృష్టికర్త. ఇస్లాంలో ఏకేశ్వరోపాసన కఠోర నియమము. అల్లాహ్‌పై విశ్వాసప్రకటనను షహాద అని, మరియు ఏకేశ్వర విశ్వాసాన్ని తౌహీద్ అంటారు. అల్లాహ్ యొక్క 99 విశేషణాత్మక నామవాచకాలు కలవు. ముస్లింలు భగవన్నామస్మరణ చేయునపుడు ఈ నామాలన్నీ స్మరిస్తారు.

వెబ్దునియా పై చదవండి