మనిషి చనిపోతాడని కుక్కకు ముందే ఎలా తెలుస్తుంది...?

బుధవారం, 6 మార్చి 2019 (21:16 IST)
ఈ భూమిపై ఉన్న ప్రతి జీవికి కూడా ఏదో ఒక శక్తి ఉంటుంది. శక్తి అంటే మామూలు శక్తి కాదు. అతీంద్రియ శక్తులు ఉంటాయి. మనుషులు ఒక్కొక్కరు మరొకరితో ఏవిధంగా అయితే భిన్నంగా ఉంటారో అదేవిధంగా జంతువులు కూడా భిన్నంగా వేర్వేరు శక్తులను కలిగి ఉంటాయి. చాలామంది ఊర్లో కుక్కలు ఏడిస్తే అశుభమని భావిస్తారు. ఊర్లో కుక్కలు ఏడిస్తే యమధర్మరాజు ఊర్లోకి వచ్చి ఉంటాడని గ్రామస్తులు భావిస్తారు.
 
కుక్కలు వాసన పసిగట్టి ఎలాగైతే దొంగలను పట్టుకుంటాయో అదేవిధంగా మానవులకు కనిపించని దివ్యశక్తులు, దుష్టశక్తులు కనిపిస్తాయనేది విశ్వాసం. ఆ విధంగా వింత శబ్థం చేస్తాయి... ఏడ్చినట్లుగా శబ్ధం చేస్తాయి. అయితే కొంతమంది మూఢనమ్మకాలను కొట్టిపారేసినా కొంతమంది మాత్రం నిజమని నమ్ముతారు. ఎలాగంటే హంస పాలలో నుంచి నీటిని వేరు చేస్తుంది అంటారు. మరి నిజమేనా.. పిల్లి ఎదురొస్తే అపశకుమనం అంటారు. ఎంతవరకు నిజం. అయితే దీన్ని వైద్యులు కూడా నిర్థారించడం లేదు. 
 
కుక్కలకు ఏదో తెలియని శక్తులు ఉంటాయని గ్రీకు దేశస్తులు కనుగొన్నారట. కుక్కలు చేసే క్రియను బట్టి జరిగే శుభాన్ని, అశుభాన్ని వారు అంచనా వేసేవారట. కుక్కలు చర్యను మారికార్ అనే శాస్త్రవేత్త అప్పట్లో కనిపెట్టి అసలు విషయాన్ని బయటపెట్టాడట. కుక్క పదే పదే ఏడిస్తే ఆ కుక్కకు దెయ్యం కనిపించిందని సంకేతమట. అలాగే ఆ సమయంలో రెండు చెవుల మధ్య బాగం గుండా చూస్తే ఆ కుక్క దేన్ని చూసి ఏడుస్తుందో మనకు కూడా కనిపిస్తుందట. కుక్కలో ప్రయాణించే రసాయన మార్పులను శాస్త్రవేత్తలను గమనించారట. చావుకు దగ్గర ఉన్న మనిషి కుక్కకు దగ్గర ఉంటే గాలి ద్వారా అవి పసిగట్టి గట్టిగా ఏడుస్తాయని మారికార్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు