అద్భుతం ఆ దేవాలయాలు... ఎందుకని?

మంగళవారం, 19 జనవరి 2021 (20:05 IST)
మనదేశం ఆధ్యాత్మికతతో నిండిపోయినది చెపుతారు. ఇక్కడ వెలసిన దేవతలు, వారి విశిష్టతలు తెలుసుకుంటూ వుంటే అద్భుతం అనిపిస్తుంటుంది. అలాంటి వాటిలో కొన్నింటిని చూద్దాం.
 
స్వామివారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయాలుగా పేరున్నవి... కేరళ శ్రీ కృష్ణ దేవాలయం, బృందావనం రాధాకృష్ణ శయన మందిరం.
 
12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడి తిరిగి అతుక్కునేదేవాలయం-  బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.
 
సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు-
1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం, కడప జిల్లా.
 
నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు: 
1. మహానంది
2. జంబుకేశ్వర్ 
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి. 
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం. 
6. బెంగళూర్ మల్లేశ్వర్, 
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం, 
8. సిద్ధగంగా.
 
 
నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు. 
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్. 
3. మంజునాథ్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు