నోకియా కొత్త ఆవిష్కరణ.. చంద్రుడిపై నోకియా 4జీ నెట్‌వర్క్‌

శుక్రవారం, 31 మార్చి 2023 (14:55 IST)
Moon
నోకియా సంస్థ కొత్త ఆవిష్కరణకు గురైంది. చంద్రుడిపై నోకియా 4జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం 4జీ, 5జీ నెట్ వర్క్‌లు సేవలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్థితిలో ఈ ఏడాది చివరి నాటికి చంద్రుడిపై 4జీ మొబైల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని నోకియా కంపెనీ నిర్ణయించింది.
 
భవిష్యత్తులో ఈ ప్రాజెక్టును స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా అమలు చేయాలని నోకియా కంపెనీ యోచిస్తోంది. చంద్రునిపై కమ్యూనికేషన్‌లను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుందని నోకియా తెలిపింది. 
 
చంద్రునిపై 4G నెట్‌వర్క్ భవిష్యత్తులో అంతరిక్ష యాత్రలకు సహాయపడుతుందని, అంతరిక్ష కమ్యూనికేషన్ రంగంలో గణనీయమైన మైలురాయిని సాధించగలదని నోకియా తెలిపింది. 
 
చంద్రుడిపై నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా చంద్రుడిని అన్వేషించడం, కొత్త ఆవిష్కరణలు పొందడం సాధ్యమవుతుందని నోకియా తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు