5జీ టెక్నాలజీతో మొబైల్ ఇంటర్నెట్ సేవలు వేగంగా అందుతాయి. అయితే ఈ మధ్య వుహాన్ నగరంలో 5జీ సేవలు స్టార్ట్ చేశారు. అయితే అప్పటి నుంచే అక్కడ కరోనా వైరస్ కేసులు ఎక్కువైనట్లు పుకార్లు వచ్చాయి. 5జీతో వైరస్ వ్యాప్తిస్తుందన్న వార్తల్లో వాస్తవం లేదని ప్రభుత్వం వెల్లడించింది. వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా ఫేక్ వార్తలను ఖండిస్తున్నారు.