కరోనా లాక్ డౌన్.. అమేజాన్ నుంచి ఉద్యోగవకాశాలు..

ఆదివారం, 22 మార్చి 2020 (18:23 IST)
కరోనా నేపథ్యంలో సంస్థలన్నీ మూతపడ్డాయి. ఇక అమెరికాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడా బార్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. కానీ వాటిల్లో పనిచేసే ఉద్యోగులు మాత్రం శాశ్వతంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. వీరి పరిస్థితిని చూసి చలించిపోయిన అమేజాన్ సీఈఓ జెఫ్ వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
 
బార్లు, రెస్టారెంట్ల మూతపడటంతో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారికి అమెజాన్‌లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని జెఫ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థలపై ఒత్తిడి పెరిగి కొత్త సిబ్బందిని నియమించుకునేందుకు ఎదురు చూస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో అమెజాన్ సీఈఓ నిర్ణయం ఇరువర్గాలకు లాభదాయకంగా ఉంటుంది. ఈ కామర్స్ సంస్థల సేవలకు ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా మరో 1.5 లక్షల తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటామంటూ రిటైల్ స్టోర్ల సంస్థ వాల్‌మార్ట్ కూడా ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు