భారత్‌లో యాపిల్ తొలి బ్రాండెడ్‌ రిటైల్‌ స్టోర్‌ ప్రారంభం

మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (14:06 IST)
యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ మంగళవారం భారత్‌లో కంపెనీ తొలి బ్రాండెడ్‌ రిటైల్‌ స్టోర్‌ ప్రారంభం అయ్యింది. యాపిల్ సీఈవో టిమ్ కుక్ ముంబై స్టోర్ నుంచి బయటకు వచ్చి పెద్ద సంఖ్యలో కస్టమర్లతో సెల్ఫీలు తీసుకున్నారు. 
 
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఉన్న Apple BKC స్టోర్ భారతదేశంలోని రెండు ఫ్లాగ్‌షిప్ రిటైల్ స్టోర్‌లలో మొదటిది, రెండవ స్టోర్ త్వరలో న్యూఢిల్లీలో ప్రారంభం అవుతుంది. 
 
ఈ కొత్త స్టోర్ ఓపెనింగ్‌లతో పాటుగా దూకుడుగా ఉండే విక్రయ కార్యక్రమాలు భారతదేశంలో ఆపిల్ వృద్ధికి ఆజ్యం పోస్తాయని భావిస్తున్నారు. Apple BKC స్టోర్ "ముంబై రైజింగ్" అనే ప్రత్యేక సిరీస్‌ను అందిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు