అయితే, ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేయడంలో ఉన్న సానుకూలతలను కుక్ మరోసారి గుర్తుచేశారు. ఎదురెదురుగా కూర్చొని పనిచేసే విధానం కంటే మెరుగైన ప్రత్యామ్నాయమే లేదని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ.. సంస్థ వెలుపల ఉండి మంచి ఫలితాల కోసం పనిచేయడం నేర్చుకోగలిగామన్నారు. ఈ సంక్షోభ కాలంలో వచ్చిన మంచి మార్పులను కొనసాగించేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.