డిజిటల్ సెక్యూరిటీ దిగ్గజం అవాస్ట్ గేమర్స్‌ని టార్గెట్ చేస్తున్న యాప్స్‌ని గుర్తించి లిస్ట్ బయటపెట్టింది. మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్ అభిమానులనే ఈ యాప్స్ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. ఫ్లీస్‌వేర్ అప్లికేషన్స్ యూజర్లకు వాల్‌పేపర్స్, మాడిఫికేషన్స్ లాంటివి ఎర వేసి డబ్బులు కాజేస్తున్నాయి.
ప్రతి నెల ఇలా వినియోగదారుల నుండి చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇలా తమ వినియోగదారుల నుండి డబ్బులు కాజేస్తున్న 7 యాప్స్‌ని గుర్తించింది అవాస్ట్. అందుకే వీటిని డౌన్లోడ్ చేసుకోవద్దని, ఒక వేల డౌన్‌లోడ్ చేసుకుంటే వెంటనే వీటిని మొబైల్ నుండి తొలగించాలని పేర్కొంది.