వివరాల్లోకి వెళితే.. Better.com అధిపతి విశాల్ గార్గ్, వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారంపై ఉద్యోగులను సమావేశపరిచారు. ఈ కాల్‌లో 900 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు ఎదురయ్యాయి. దీంతో తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన క్షమాపణలతో పాటు గార్గ్ తొలగింపులను నిర్వహించిన తీరుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
ప్రభావితమైన వ్యక్తుల పట్ల అలా నడుచుకోవడం సరికాదన్నారు. వారి సహకారాలకు తగిన గౌరవాన్ని, ప్రశంసలను ఇవ్వడంలో తాను విఫలమయ్యానని చెప్పారు. తొలగింపులు చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. కానీ దానిని సరైన విధంగా కమ్యూనికేట్ చేయడంలో తప్పుచేశాను. అలా చేయడం ద్వారా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను.. అని రాశారు.