29 నుంచి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా..

శనివారం, 27 మే 2023 (15:39 IST)
పబ్‌జీ మొబైల్ గేమ్‌పై దేశంలో నిషేధం విధించడం జరిగింది. పబ్‌జీకి ప్రత్యామ్నాయమైన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా మొబైల్ గేమింగ్ ఈ నెల 29 నుంచి అందుబాటులోకి రానుంది. దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టాన్ భారత విభాగమే క్రాఫ్టాన్ ఇండియా.
 
దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పబ్‌జీకి అప్పట్లో 3.3 కోట్ల మంది యూజర్లు ఉండేవారు. యాపిల్ ఐవోఎస్ యూజర్లు 28వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
 
పబ్ జీకి కొత్త రూపమే బ్యాటిల్ గ్రౌండ్స్. దీన్ని భారత మార్కెట్ కోసమే అభివృద్ధి చేశారు. ఈ యాప్‌కు కేంద్ర సర్కారు నుంచి అనుమతి కూడా వచ్చింది.

వెబ్దునియా పై చదవండి