బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.444లకే చౌక డేటా ఆఫర్- పోటీ పడుతున్న టెలికాం సంస్థలు

శుక్రవారం, 16 జూన్ 2017 (09:52 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్లతో దూసుకెళ్తోంది. జియో దెబ్బతో పాటు ఎయిర్ టెల్ నుంచి గట్టి పోటీని తట్టుకునేందుకు వీలుగా.. బీఎస్ఎన్ఎల్ తన ప్రీ పెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం సరికొత్త డేటా ఆఫర్‌ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ ఆఫర్‌తో రూ.444లకు రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు 90 రోజుల 3జీ వేగంతో ప్రతిరోజూ 4జీబీ డేటాను అందించనున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో  వెల్లడించింది. 
 
ఈ ఆఫర్ కారణంగా వినియోగదారులు రోజు వారీ డేటా ఒక జీబీ కోసం రూపాయి కంటే తక్కువ చెల్లించే సౌకర్యం లభించినట్లైంది. ఇతర సంస్థలు రోజూ 2 జీబీ మాత్రమే అందిస్తుండగా, బీఎస్ఎన్ఎల్ 4 జీబీ 3జీ డేటా అందించడం విశేషం.
 
కాగా జియో ధనా ధన్ ప్లాన్ ద్వారా టెలికో సంస్థలు డేటా ఆఫర్లు ఇచ్చేందుకు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఐడియా, ఎయిర్‌టెల్, వొడాఫోన్ సంస్థలు ఇప్పటికే చౌకధరకే డేటా ఆఫర్లు ప్రకటించాయి. ఇటీవలే ఐడియా రూ.396కు 70జీబీ 3జీ డేటా ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ కూడా రంజాన్‌ను పురస్కరించుకుని 25జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్‌ను రూ.786కే అందించింది. 

వెబ్దునియా పై చదవండి