ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్: స్టార్325హ్యాష్‌ని గుర్తుంచుకోండి.. నెట్ లేకుండానే ఎఫ్‌బీ చూడండి.

ఆదివారం, 31 జులై 2016 (16:00 IST)
ఫేస్ బుక్ చూడాలంటే నెట్ కావాలి. అబ్బా నెట్ బిల్లు వాసిపోతుందని బాధపడుతున్నారా? ఇక భారత్‌లోని ఫేస్ బుక్ యూజర్లందరూ నెట్ లేకుండానే ఫేస్ బుక్ చూడొచ్చు. ఇదేంటి..? నిజమా.. ఎగిరి గంతేస్తున్నారు కదూ. ఇది ఫేస్ బుక్ యూజర్లందరికీ శుభవార్తే. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. స్టార్325హ్యాష్‌ని గుర్తుంచుకుంటే చాలు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే ఇకపై ఫేస్ బుక్ చూసేయవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా స్టార్325హ్యాష్‌(*325#)ని ప్రెస్ చేయడమే. 
 
స్మార్ట్‌ఫోన్ నుంచి స్టార్325హ్యాష్‌ను టైప్ చేసి ఫేస్‌బుక్ యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. ఆపై ఫేస్‌బుక్ ఫీచర్లు యాక్సెస్ అవుతుంది. ప్రస్తుతం దేశంలో ఎయిర్‌టెల్, టాటా డొకొమో, ఎయిర్‌సెల్, ఐడియా, యూజర్లు మాత్రమే ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. త్వరలోనే మిగతా నెట్‌వర్క్‌లకు కూడా విస్తరించే అవకాశాలున్నట్లు తెలిసింది.
 
ఈ సౌలభ్యం ద్వారా ఫేస్ బుక్ స్టేటస్‌ను ఫ్రీ చూసుకోవచ్చు. కానీ పోస్టింగ్, నోటిఫికేషన్ల చెకింగ్, ఫ్రెండ్స్‌ను యాడ్ చేసుకోవడం కోసం మాత్రం డబ్బు చెల్లించాల్సి ఉంటుందని ఫేస్ బుక్ అధికారులు వెల్లడించారు. ఇంకా... రోజుకు ఒక రూపాయి చెల్లిస్తే అపరిమితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
 
ఫేస్‌బుక్ ఇండియా-ఫోనెట్ విష్ భాగస్వామ్యంతో ఫోనెట్‌విష్ అంటే యూఎస్ఎస్‌డీ (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ డేటా) ఆధారంగా పనిచేసే ఇంటరాక్టివ్ సర్వీస్ ఆధారంగా నెట్ లేకుండా ఎఫ్‌బీ చూసుకోవడం సాధ్యమైందని ఇండియా ఫేస్ బుక్ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి