జియోకు గట్టిదెబ్బ.. భారత్ మార్కెట్‌పై అలీబాబా కన్ను.. ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తారట?

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (13:03 IST)
జియో ఉచిత డేటాతో దేశ ప్రజలకు సూపర్ ఆఫర్ ఇస్తే.. తాజాగా భారత్‌ మార్కెట్‌పై అలీబాబా కన్నేశారు. స్మార్ట్ ఫోన్స్‌లో పాపులరైన అలీబాబా, తన యూసీ బ్రౌజర్ సేవలను విస్తరించే క్రమంలో భారత్‌పై ఫోకస్ చేశారు. దీనికి సంబంధించి చైనా టెక్‌ దిగ్గజం అలీబాబా కసరత్తులు మొదలుపెట్టేశారు. ఇందుకోసం దేశీయ టెలికాం ఆపరేటర్లు, వైఫై ప్రొవైడర్లతో చర్చలు జరుపుతున్నట్లు ఆ సంస్థ అధికారి జాక్‌హాంగ్‌ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. 
 
తక్కువ ప్రీమియంతో భారతీయులకు మెరుగైన ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించేందుకు అలీబాబా కంపెనీ పక్కా ప్లాన్ చేస్తున్నట్లు జాక్‌హాంగ్ వెల్లడించారు. అంతేగాకుండా వీలైతే ఉచితంగా ఇంటర్నెట్ ఇచ్చే దిశగానూ రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
కానీ ఉచిత సదుపాయాలంటే భారత టెలికాం నియంత్రణ మండలి- ట్రాయ్‌ వద్ద చిక్కులు తప్పదని వారు అంచనా వేస్తున్నారు. జియో ఉచిత సర్వీసులపై ఇప్పటికే చాలామంది ట్రాయ్‌కి ఫిర్యాదు చేశారు. ఒకవేళ అలీబాబా గనుకవస్తే, తొలుత జియోకి చెక్ తప్పదని టెక్ నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి