ఇకపై 'ప్రియం' కానున్న గూగుల్ ఫోటోస్.. జూన్ నుంచి 'చార్జీలు'

శుక్రవారం, 13 నవంబరు 2020 (09:09 IST)
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్. ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్ చేశారు. అలాగే, ఎలాంటి ఫోటో కావాలన్నా అందులోనే సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకుంటారు. ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితమే. ఈ సేవలు గత ఐదేళ్లుగా ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ ఫోటోలు మరింత ప్రియం కానున్నాయి. అంటే.. ఫోటోలు డౌన్‌లోడ్ చేస్తే గూగుల్ చార్జీలు వసూలు చేయనుంది. 15 జీబీ దాటిన ఫోటోల డౌన్‌లోడ్‌కు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే. లేనిపక్షంలో ఆ ఫోటో డౌన్‌లోడ్ కాదు. 
 
నిజానికి గూగుల్ ఫోటోస్ పేరుతో ఈ సేవలను ప్రస్తుతం ఉచితంగా పొందుతున్నాం. కానీ, వచ్చే యేడాజి జూన్ ఒకటో తేదీ తర్వాత 15 జీబీ పరిమితి దాటిన ఫోటోలు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండదు. 
 
15 జీబీకి మించి ఫొటోలను దాచుకోవాలంటే నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని గూగుల్‌ వెల్లడించింది. వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తన అధికారిక బ్లాగులో పేర్కొన్నది. అయితే జూన్‌ 1వరకు అప్‌లోడ్‌చేసిన ఫొటోలు ఈ 15జీబీ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. 
 
గూగుల్‌ ఫొటోస్‌ ఉచితం కావడంతో అందులో డేటా రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇప్పటికే 4 లక్షల కోట్లకు పైగా ఫొటోలు అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. ప్రతీవారం 2,800 కోట్ల కొత్త ఫొటోలు వచ్చి చేరుతున్నాయి. దీంతో గూగుల్‌ సర్వర్లపై విపరీతమైన భారం పెరుగుతోంది. సర్వర్లపై భారం తగ్గించేందుకే గూగుల్‌ చార్జీల నిర్ణయం తీసుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు