ప్రపంచ దేశాలను అట్టుడికిస్తోన్న కరోనా నియంత్రణ కోసం భారత్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం ప్రధాని మోదీ సారథ్యంలో ఏర్పాటైన పీఎమ్ కేర్స్ నిధికి గూగుల్ పే ద్వారా రూ. 124 కోట్ల నిధులు అందాయని గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తా తెలిపారు. దాదాపు 20 లక్షల లావాదేవీల ద్వారా ఈ మొత్తం పీఎమ్ కేర్స్‌కు చేరిందన్నారు.
తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్న గూగుల్ ఇండియా ఈవెంట్ 2020లో పాల్గొన్న ఆయన.. వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు గూగుల్ పే ద్వారా పీఎమ్ కేర్స్ నిధికి విరాళాలు ఇచ్చారని తెలిపారు. ఈ ఈవెంట్‌లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రసంగించారు. భారత్‌లో డిజిటలీకరణ కోసం గూగుల్ చేపట్టిన చర్యలను గురించి ప్రస్తావించారు.
కాగా.. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలామంది తమ తమ దేశాల ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. మన దేశంలో కూడా పిఎం కేర్ ఫండ్స్ భారీగానే వచ్చాయి. అదీ గూగుల్ పే ద్వారా. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఏర్పాటైన పీఎమ్ కేర్స్ నిధికి గూగుల్ పే ద్వారా రూ. 124 కోట్ల నిధులు అందాయని గూగుల్ ప్రకటించింది.