మీ పేరు, ఊరు, వయస్సు, జెండర్, అడ్రస్... ఇలా మీకు సంబంధించిన అనేక వివరాలు గూగుల్ చేతిలో ఉంటాయి. యురోపియన్ యూనియన్ ప్రైవసీ రెగ్యులేషన్స్‌ని తప్పించుకునేందుకు హిడెన్ వెబ్ పేజెస్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని అడ్వర్టైజర్లతో గూగుల్ పంచుకుంటోందని ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ బయటపెట్టింది. బ్రౌజర్ మేకర్ బ్రేవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దర్యాప్తును మేలోనే ప్రారంభించిందని డేటా ప్రొటెక్షన్ కమిషన్ వెల్లడించింది.