గూగుల్ సెర్చింజన్ జీ-మెయిల్ సేవకు సంబంధించిన ప్రాథమిక HTML వెర్షన్‌ను జనవరి 2024లో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. బ్రౌజర్లో జీమెయిల్ తాజా వెర్షన్‌ను ఉపయోగించండే శీర్షికతో గూగుల్ ఈ వివరాలను ఇచ్చింది. దీంతో Google ప్రాథమిక HTMLకు బైబై చెప్పాలని గూగుల్ నిర్ణయించుకుంది. జనవరి 2024 వరకు ప్రాథమిక HTMLను బ్రౌజర్‌లో కనిపిస్తుందని సంస్థ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
ఇంతలో, Google Androidలోని Gmailకి ఉపయోగకరమైన "అన్నీ ఎంచుకోండి" బటన్‌ను జోడిస్తోంది. వినియోగదారులు తమ ఇన్‌బాక్స్‌ను మరింత సులభంగా, క్లియర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.