ఫేక్ యూనిక్ ఐడెంటిటీ నంబర్ల సెల్ ఫోన్లపై నిషేధం!

మంగళవారం, 20 జనవరి 2015 (10:50 IST)
ఫేక్ యూనిక్ ఐడెంటిటీ నంబర్ల ద్వారా దేశీయ మార్కెట్లోకి దిగుమతి అవుతున్న సెల్‌ఫోన్లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. 
 
నకిలీ ఐఎంఈఐలతో వస్తున్న జీఎస్ఎం మొబైళ్లతో పాటు డూప్లికేట్ ఈఎస్‌ఎన్ (ఎలక్ట్రానిక్ సీరియల్ నంబర్), ఎంఐఐడీతో (మొబైల్ ఎక్విప్‌ మెంట్ ఐడెంటిఫైయర్) దిగుమతి అవుతున్న సీడీఎంఏ ఫోన్లపై నిషేధం విధిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఆదేశాలు జారీ చేసింది.

వెబ్దునియా పై చదవండి